Tragedy: బాణసంచా పేలుడు.. ఊపిరాడక ఐదుగురు మృతి
- ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం
- బాణసంచా పేలి ఐదుగురు మృతి
- ఊపిరాడక కుటుంబ సభ్యులు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్‌మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హోలీ పండగ కోసమని పటాకులు అమ్మేందుకు కిరాణ వ్యాపారి కుష్ గుప్తా (45) సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో భారీగా పటాకులు అమ్మకానికి తీసుకురాగా.. వాటిని కిరాణం షాపు బయట ఎండలో పెట్టాడు. అయితే ఎండ వేడికి పటాకులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా పొగలతో కమ్ముకుపోయింది. అంతేకాకుండా.. పేలుడు శబ్దం భారీగా రావడంతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Read Also: ICC: ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్‌కు దక్కని చోటు.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా.. పొగ భారీగా కమ్ముకోవడంతో కుష్ గుప్తా తన కిరాణా దుకాణంలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. అతని భార్య, పిల్లలు వెళ్లారు. అయితే పొగ వస్తుందని షాపు షట్టర్‌ను కిందకు దించాడు. ఈ క్రమంలో.. పొగ, గ్యాస్ షాపులోకి ప్రవేశించి ఊపిరాడక చేసింది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు వెనుక గోడ భాగాన్ని కట్ చేశారు. అనంతరం పోలీసులు లోపలికి చేరుకునేసరికి కుటుంబమంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..
ఈ క్రమంలో వెంటనే ఐదుగురినీ రామానుజ్‌గంజ్‌లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ అందరూ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే మరించారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో ఒక చిన్నారి, మహిళ కూడా ఉన్నారు. అనంతరం పోస్ట్‌మార్టం చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!