ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్‌మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు.
Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో కారు డివైడర్‌ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్‌లో వేగం వెళ్తున్న కారు, బైక్‌ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్‌ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
7 Dead in a stampede in Bihar: బిహార్‌లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సోమవారం ఉదయం తెలిపారు. మృతుల…