Uttarakhand : వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పర్వతాలపై మంటలు చెలరేగడంతో చెట్లు, మొక్కలు కాలి బూడిదవుతున్నాయి. గత 24 గంటల్లో 13 అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ అగ్నిప్రమాదానికి 11 హెక్టార్ల అడవులు దెబ్బతిన్నాయి. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. మంటలను ఆర్పేందుకు ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేస్తున్నారు కానీ బలమైన గాలులు కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అగ్నిప్రమాదంతో అటవీ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. అడవిలోంచి ఎగసిపడుతున్న మంటలు, పొగలు చాలా దూరం నుంచి కనిపిస్తున్నాయి. బుధవారం కూడా, తెహ్రీ, నరేంద్రనగర్, రామ్‌నగర్, లాన్స్‌డౌన్ ఫారెస్ట్ డివిజన్, కేదార్‌నాథ్ వన్యప్రాణి డివిజన్‌లలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. పైన్ చెట్టు నుండి రాలిన ఎండు ఆకులు, గడ్డి మంటలకు కారణమని భావిస్తున్నారు.
రాష్ట్రంలోని దుగ్గాడలోని సివిల్ ఫారెస్ట్‌లో, లాన్స్‌డౌన్ కోట్‌ద్వార్‌లోని జైహరిఖాల్‌లో చెలరేగిన మంటలు బుధవారం కూడా దహనం చేస్తూనే ఉన్నాయి. సాయంత్రం వరకు అటవీ శాఖ బృందం ఆయా ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. జైహరిఖల్‌లోని సివిల్ ఫారెస్ట్‌లలో చెలరేగిన మంటలు ఇప్పుడు లాన్స్‌డౌన్‌లోని కంటోన్మెంట్ ఏరియాలోని అడవులకు చేరాయి. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆర్మీ సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు పూనుకున్నారు. ఎట్టకేలకు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఫర్సులా బీట్‌లోని జడ్ల అడవులు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఆయన బృందంలోని 12 మంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి 11 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లాన్స్‌డౌన్ ఫారెస్ట్ డివిజన్‌లోని ఫర్సులా బీట్ రిజర్వ్ చేయబడిన ప్రాంతం కూడా మంటల్లో చిక్కుకుంది. లాన్స్‌డౌన్ రేంజ్ అటవీ సిబ్బంది కూడా మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పేందుకు రెండు రేంజ్‌ల నుంచి 22 మంది సిబ్బంది రంగంలోకి దిగారు.
Read Also:IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
మానసాదేవి అడవుల్లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. అయితే పెట్రోలింగ్‌లో ఉన్న అటవీ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో మంటలను ఆర్పే క్రమంలో మనోజ్ శర్మ అనే అటవీ కార్మికుడు మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ కార్మికుడు మనోజ్ 22 శాతం కాలిపోయాడు. ఆస్పత్రిలో అతడికి చికిత్స కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ అడవుల్లో నిరంతరం మంటలు చెలరేగుతున్నాయి. బుధవారం చూస్తే, ఉత్తరాఖండ్ అడవుల్లో 24 గంటల్లో 13 కొత్త అగ్నిప్రమాదాలు జరిగాయి. మంటల్లో 11 హెక్టార్ల అడవి దగ్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 490 అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీని కారణంగా 581 హెక్టార్లలో అడవి దగ్ధమైంది. ఆర్మీ సిబ్బంది కూడా కొండ అడవిలో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఉత్తరాఖండ్ అడవుల్లో 2016లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్, మే మధ్య పర్వతాల అడవి మంటలు మండుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. 4,538 హెక్టార్ల (11,210 ఎకరాలు) అడవి అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మంటలను ఆర్పేందుకు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.
Read Also:WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. నెట్ తో పనిలేకుండానే పంపొచ్చు..