హైదరాబాద్‌లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామాటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరెగాయి.. దీంతో.. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే.. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో 5 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన…