దీపావళి పండుగ వేళ ఏపీలో అగ్ని ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వరుసగా ఏపీలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరు జిల్లాలోని ఏటుకూరు రోడ్డులోని ఆర్ఎస్ పాలీమర్స్ ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Also Read :Kantara Movie : కాంతారకు లీగల్ నోటీసులు ?.. ఎందుకంటే
అయితే ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అయితే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. అయితే.. ప్లాస్టిక్‌కు సంబంధించి గోడౌన్ కావడంతో మంటల వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణాల ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.