NTV Telugu Site icon

Oscar Academy : జక్కన్న దంపతులకి అరుదైన గౌరవం..

Rajamouli

Rajamouli

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది.

Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..

ఆస్కార్ అవార్డు మొదటి భారతీయ సినిమాగా (పాటకి గాను) లభించింది. ఈ RRR సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వానం అందించిన సంగతి తెలిసింది. ఇదే మాదిరిగా తాజాగా రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి లకు కూడా ఆహ్వానాన్ని అందించింది.

Health Tips : ఆ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యలు దూరం..

దీంతో ఈ సందర్భం రాజమౌళికి ప్రైడ్ మూమెంట్ గా నిలవబోతోంది . తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరిలో సిద్ధం చేశారు. వీరిలో రాజమౌళి, రమా రాజమౌళిలు స్థానాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో అకాడమీ వారు వీరిద్దరికీ ఆహ్వానం పలికింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SS రాజమౌళి, రమా రాజమౌళితో పాటు.. ఇతర ప్రముఖ భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్, రీమా దాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. గత సంవత్సరం, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులు కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)లోకి ప్రవేశించారు.