బోర్డు మీటింగ్ లో 15 అంశాలపై కూలంకషంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి. ఎపీఎస్ఎఫ్ఎల్ విస్తరణ కోసం అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రంలో కొత్తగా మరో 24వేల కి.మీ ఎపీ ఎస్ ఎఫ్ఎల్ కేబుల్ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట వ్యాప్తంగా టిడ్కో, జగనన్న కాలనీల్లో ఏపీ ఫైబర్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన ఆయన తెలిపారు. టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలకు ప్రైవేట్ నెట్ వర్కులు కనెక్షన్లు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ. 190కే ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గౌతమ్ రెడ్డి. అవసరమైన చోట్ల వినియోగదారులకు డబుల్ బాక్సులు ఇస్తామని, ఇప్పటికే ఇచ్చిన బాక్సులు రిపేర్ కోసం విజయవాడ, విశాఖ, తిరుపతి సహా పలు ప్రాంతాల్లో సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ వార్షిక జనరల్ బాడీ మీటింగును మార్చి నెలాఖరుకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్టు నుంచి రావాల్సిన వెయ్యి కోట్లల్లో రూ. 500కోట్లు వచ్చాయని, కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన రూ. 500 కోట్లను తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Also Read : BRS News Paper In AP: త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ న్యూస్ పేపర్..?
అంతేకాకుండా.. ‘రాష్ట్రవ్యాప్తంగా ఎపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు చేసిన సీసీటీవీలను హోం శాఖకు అప్పగించాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాం. ప్రభుత్వ కార్యాలయాలు నుంచి ఎపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 120 కోట్లు రావాల్సి ఉంది. వాటి వసూలుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్లకు రేట్లు పెంచే ప్రశ్నే లేదు. ఎవరైనా బ్రాడ్ కాస్టర్లు టారిఫ్ రేట్లు పెంచేందుకు చూస్తే సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయం. ఇతరులు కూడా కనెక్షన్ రేట్లు పెంచవద్దని కోరుతున్నా. సినిమాల కోసం త్వరలో ఎపీఎస్ఎఫ్ఎల్ యాప్ ను తయారు చేసి అందుబాటులోకి తెస్తాం. కొత్త సినిమా రిలీజై సినిమా ధియేటర్లో ప్రదర్శించిన సమయంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఓటీటీలో ప్రదర్శించేెదుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 50 లక్షల కొత్త బాక్సులు మాకు అవసరమై ఉంది. సీఎం టు సిటిజన్ పద్దతుల్లో కస్టమర్లు ఇబ్బందులు పడకుండా కనెక్షన్లు ఇస్తాం. కొత్త బాక్సులకు సరఫరా కోసం తయారు చేసే కొత్త సంస్థలను ఆహ్వానిస్తున్నాం.కొత్త కంపెనీల ద్వారా బాక్సులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : AIADMK: అన్నాడీఎంకే పళనిస్వామిదే.. పన్నీర్ సెల్వానికి సుప్రీంకోర్టు షాక్..