Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో తెల్లవారుజామున ఓ ఫెరారీ (Ferrari) స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో దూసుకొచ్చిన సదరు విలాసవంతమైన కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ నివాస గృహం ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం ధాటికి ఆ ఇంటి గేటు పూర్తిగా బద్దలైపోయింది.
అత్యంత వేగంగా వెళ్లి గేటును గుద్దడంతో ఫెరారీ స్పోర్ట్స్ కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు భయాందోళనతో కారును అక్కడే వదిలేసి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తెల్లవారుజామున పెద్ద శబ్దంతో గేటు బద్దలు కావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కారు బీభత్సంపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారైన యువకులు మద్యం మత్తులో (డ్రంక్ అండ్ డ్రైవ్) ఉండి, కారును కంట్రోల్ చేయలేక అత్యంత వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఫెరారీ స్పోర్ట్స్ కారును పోలీసులు క్రేన్ సహాయంతో టోవింగ్ వెహికల్‌పైకి ఎక్కించి, తదుపరి దర్యాప్తు నిమిత్తం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం (రాష్ డ్రైవింగ్) వల్ల జరిగిందా? లేక యువకులు నిజంగానే మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ప్రస్తుతం పోలీసులు కారు నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదం స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.
Also Read
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!