మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
Uncontrolled Car : హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బల్లాభ్‌ఘర్‌లో అర్థరాత్రి ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.