మారుతున్న సీజన్‌తో పాటు సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ప్లేట్‌లెట్స్‌ని తగ్గించే ఈ ఇన్‌ఫెక్షన్ గురించి తెలియక లైట్ తీసుకుంటే ప్రాణాలే పోయే ప్రమాదం ఏర్పడవచ్చు.
డెంగ్యూ పాజిటివ్ వచ్చిన తర్వాత వైద్య చికిత్సతో పాటు కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించాలి.
తద్వారా ప్లేట్‌లెట్స్ అదుపులో ఉండి, రోగి త్వరగా కోలుకోవచ్చు.
అన్నింటిలో మొదటిది డెంగ్యూ వచ్చినవారు విశ్రాంతిపై దృష్టి పెట్టాలి. మీ వ్యాయామం, పని, షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవాలి.
వైరల్ ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి , కోలుకోవడానికి శరీరం తన శక్తిని ఉపయోగించుకుంటుంది.
చాలా మంది బొప్పాయి ఆకులను కషాయాలను తయారు చేసి తాగుతారు. ఇలా కాకుండా..
తాజా బొప్పాయి ఆకు తీసుకుని దాని కాండం కోయండి. తర్వాత దానిని కడిగి, బాగా తరిగిన తర్వాత వాటిని తినాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్లేట్‌లెట్లను పెంచడంలో ఈ ఆకును 'గ్రీన్ గోల్డ్'గా పరిగణిస్తారు.
మీరు తాజా ఆకులను పొందలేకపోతే, బొప్పాయి ఆకు సప్లిమెంట్‌ను డాక్టర్ సలహా మేరకు తినండి.