Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను తను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు ఫరూక్ అబ్దుల్లా. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిని తప్పుబట్టారు బీజేపీ నేత అమిత్ మాలవీయ . ఇక ఈ వీడియోలో ఫరూక్ అబ్దుల్లా తన మనవరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న ఓ రిపోర్టర్ తో మాట్లాడారు.
Also Read: Asia Cup Final: గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు షాక్.. ఫైనల్‌కు స్టార్ ప్లేయర్ దూరం!
ఫరూక్ అబ్దుల్లాను ఏదో అడగడానికి మహిళ రిపోర్టర్ ప్రయత్నించగా ఆయన ఆమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ప్రశ్నించారు. అంతటితో ఆగి పోకుండా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బందికి గురిచేశారు. అయితే ఏం చేయాలో తెలియని ఆ రిపోర్టర్ నవ్వుతూ ఉండిపోయింది. ఆయన అలా అడుగుతుంటే పక్కన ఉన్నవారు కూడా నవ్వుకున్నారు. అంతేకాదు మధ్య మధ్యలో ఆమె చేతిని తడుముతూ మాట్లాడారు ఫరూక్ అబ్దుల్లా. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ ఎక్స్(ట్విట్టర్) లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రిపోర్టర్ వయసు ఆయన మనవరాలితో సమానం. లేదా అంతకంటే తక్కువే. అయినా.. ఎప్పుడు నీవు పెళ్లి చేసుకుంటావు? నువ్వే నీ భర్తను ఎంపిక చేసుకున్నావా? మీ తల్లిదండ్రులు చూస్తారా? అని ప్రశ్నలు అడిగారు.
అంతేకాకుండా ఆమె చేతిమీద ఉన్న మెహందీని చూసి నీ చేతులపై ఈ మెహెందీ ఎందుకు ఉంది? వంటి అసౌకర్యకరమైన ప్రశ్నలు వేశారు. దీంతో ఆమె తన సోదరుడి వివాహం అని చెప్పగా.. అతని భార్య అతడితోనే ఉంటుందా? లేక వదిలేసి వెళుతుందా? అని అబ్దుల్లా చాలా చిరాకైన కామెడీ చేశారు. నీవు పెళ్లి చేసుకున్నావా? అని అబ్దుల్లా మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఆమె ‘సర్ నేను చాలా చిన్న దాన్ని ఇప్పుడు’అని బదులిచ్చింది. దానికి మళ్లీ అబ్దులా స్పందిస్తూ ఎవరిని పెళ్లి చేసుకుంటావో జాగ్రత్త పడు. ఎవరికి తెలుసు అతడు మహిళలతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, అది అయితే నీకు తెలియకపోవచ్చు అంటూ అబ్దుల్లా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహిళలను పని ప్రదేశాల్లో ఎలా ఇబ్బంది పెడతారో అనడానికి ఇది చక్కటి ఉదాహరణ అంటూ మాలవీయ ఈ మొత్తం వీడియో గురించి పోస్ట్ చేశారు.
Farooq Abdullah, I.N.D.I Alliance veteran and father of ever pontificating Omar Abdullah, is at his abominable best. If there was ever a case of making workplace uncomfortable for women, then this is it.
The reporter is perhaps his grand daughter’s age or younger. But that… pic.twitter.com/8zmb2aYrPY
— Amit Malviya (@amitmalviya) September 15, 2023