Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో…