Pushpa 2: పుష్పరాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. మొత్తం ఎంత మంది వచ్చారంటే?
- అట్టహాసంగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్
- దాదాపు రెండు లక్షల మంది వచ్చినట్లు అంచనా
- హిందీలో మాట్లాడిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు మరికొందరు చిత్రబృంద సభ్యుల రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ట్రైలర్ ను విడుదల చేశారు.
Read Also:Ram Charan : నేడు కడపకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ ఈవెంట్ పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఈవెంట్ ని పాట్నాలో నిర్వహించడంతో పబ్లిక్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో తన కోసం వచ్చిన వారికోసం హిందీలో కాసేపు మాట్లాడారు. మొదటిసారి తాను బీహార్ వచ్చానని ఇక్కడి ప్రజలు అద్భుతంగా తనని రిసీవ్ చేసుకున్నారని అల్లు అర్జున్ అన్నారు. ఈ ఈవెంట్ కి ఏకంగా రెండు లక్షల మందికి పైగా జనాలు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపొయింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ ని చూడటానికి అక్కడి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారని వచ్చిన జనాన్ని చూస్తే తెలుస్తోంది. ఈ క్రౌడ్ బట్టి ‘పుష్ప 2’ పట్ల బీహార్ ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
Read Also:Guntur Crime: గుంటూరులో దారుణం.. స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. కొట్టి చంపి బావిలో పడేశారు..!
ఇండియన్ మూవీ హిస్టరీలో ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరగడం మొదటి సారి. ‘పుష్ప’ లాంటి ఒక్క సినిమా ఇమేజ్ తోనే నార్త్ లో పుష్పరాజ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందనేది ఈ ఈవెంట్ తోనే స్పష్టం అవుతోందని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయే ఆరు ఈవెంట్స్ కూడా ప్రధాన పట్టణాలలో నిర్వహించబోతున్నారు. వీటికి కూడా లక్షల్లో పబ్లిక్ హాజరయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ‘పుష్ప 2’ మూవీకి భారీ హైప్ రావడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ‘పుష్ప 2’ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజావార్తలు
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!