నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు తో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ చేసిన పోలీసులు మరో నలుగురు కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పుడు.. నకిలీ మద్యం కేసులో పరారిలో ఉన్నా ప్రధాన నిందితుడు కోండల్ రెడ్డి అలియాస్ శీవరెడ్డిని అదుపులోకి తీసుకోని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఒడిస్సా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఎక్సైజ్ దాడులు చేసి మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ రవీందర్రావు తెలిపారు. ఒడిస్సా లోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించారు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు.
Also Read : Chiranjeevi-Balakrishna: పాతికేళ్ళ తరువాత అదే తీరున చిరు- బాలయ్య!
దాదాపు కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అని గుర్తు చేశారు. ఒడిస్సాలో తయారుచేసి తెలంగాణ బ్రాండ్ పేరుతోటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తోంది ఈ ముఠా. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటామాని పోలీసులు పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికలకు తెలంగాణ బ్రాండ్ పేరుతోటి నకిలీ మద్యాన్ని ఈ ముఠా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఒడిస్సాలో ఉన్న నకిలీ మద్యం స్థావరంపై దాడులు చేసి ధ్వంసం చేశారు ఎక్సైజ్ పోలీసులు.