కరీంనగర్ : కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈటల రాజేందర్ లేఖ రాశారంటూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను తొందరగా విడుదల చేసి, దళిత బంధును, రైతు బంధును ఆపేయాలని ఈటల పేర్కొన్నట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పారామిలటరీ బలగాలతో ఉపఎన్నిక జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ను ఈటల రాజేందర్ కోరినట్లుగా ఆ లేఖలో ఉండటం గమనార్హం. అయితే… దీనిపై స్పందించింది బీజేపీ పార్టీ. అది ఫేక్ లెటర్ అంటూ ఖండించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ. టీఆరెస్ నేతలు ఫేక్ లెటర్స్ ఆపేయాలని… దళిత బంధు డబ్బులు జమ చేయాలని కోరిందే ఈటెల రాజేందర్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ కావాలనే ఫేక్ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.