Fake Baba: నకిలీ బాబా లీలలు.. ఇల్లు, పొలం అమ్మేస్తే సమస్య తొలగిపోతుందని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30 లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ ఖాసీం కుటుంబం వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని అందుకే ఇంట్లో అందరూ అనారోగ్యం పాలవుతున్నారని ఆ బాబా నమ్మించాడు.
Also Read: SRSP: 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్సారెస్పీ.. నేటి నుంచి సాగు నీటి విడుదల
Also Read
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
ఇల్లు, పొలం అమ్మేస్తే సమస్య తొలగిపోతుందని నయ్యర్ బాబా చెప్పాడు. ఈ నేపథ్యంలో షేక్ ఖాసీం కూడా ఇల్లు, పొలం అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఆ నకిలీ బాబానే మధ్యవర్తిగా ఉండి 5 ఎకరాల పొలం, ఇల్లు అమ్మించి కోటి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ డబ్బులకు బదులు హైదరాబాద్‌లో ఇల్లు ఇస్తానని, కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నయ్యర్ బాబా చెప్పాడు. కొన్ని రోజులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు షేక్ ఖాసీం మంగళవారం మక్కరాజుపేటకు వచ్చాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ బాబా నయ్యర్‌పై 2017లో హైదరాబాద్‌లో 70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇలా బాబాలను నమ్ముకుని మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?