Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ బౌలర్ జట్టులో ఉండటం మీ అదృష్టం”.. డు ప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faf du Plessis: భారత జట్టు ఫైనల్‌కు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో టీమ్‌ను రక్షించడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis) కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం లేదన్నాడు. ఒత్తిడి సమయంలో జస్ప్రీత్ బుమ్రా చూపిన నియంత్రణే మ్యాచ్ ఫలితాన్ని మార్చిందని వెల్లడించాడు. జట్టుకు ఇలాంటి బౌలర్ ఉండటం అంటే కెప్టెన్‌కు అద్భుత శక్తి లభించినట్టేనన్నాడు.
READ MORE: Karnataka: కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
డుప్లెసిస్ మాటల్లో చెప్పాలంటే బుమ్రా సాధారణ బౌలర్ కాదు. ఏ ఫార్మాట్ అయినా సరే, బుమ్రాకు బౌలింగ్ ఇస్తే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పే సామర్థ్యం ఉంది. కెప్టెన్‌కు ఇది శక్తిలాంలా మారుతుంది. బుమ్రా ఒక మాయశక్తిలా ఉంటాడని డు ప్లెసిస్ సరదాగా చెప్పాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో పరుగులు భారీగా వచ్చినప్పటికీ బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం ముప్పై మూడు పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న కీలక దశల్లో బుమ్రా వేసిన ఐదవ, పదకొండవ, పదహారవ, పదెనిమిదవ ఓవర్లు మ్యాచ్ మలుపు తిప్పాయి. ఇతర బౌలర్లపై దాడి చేసిన బ్యాటర్లు బుమ్రా ఎదుట మాత్రం అంత సులభంగా పరుగులు తీయలేకపోయారు.
READ MORE: CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
బుమ్రా బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకత గురించి కూడా డుప్లెసిస్ వివరించాడు. “అతని చేతి కదలిక చాలా విభిన్నంగా ఉంటాయి. చేతి నుంచి బంతి ఎప్పుడు బయటకు వస్తుందో బ్యాటర్‌కు స్పష్టంగా అర్థం కావడం కష్టం. వేరే బౌలర్‌కు లెంత్ తప్పితే భారీ షాట్‌గా మారుతుంది. కానీ.. బుమ్రా విషయంలో అది అంత తేలిక కాదు. చివరిలో బుమ్రా వేసిన రెండు షార్ట్ లెంత్ ఫుల్ టాస్ బాల్స్‌పై సామ్ కర్రన్ ఆలస్యంగా స్పందించాడు. అదే బంతిని మరొక బౌలర్ వేస్తే అది సిక్సర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉండేది. కానీ బుమ్రా బౌలింగ్‌లో ఇది సాధ్యం కాదు.” అని వెల్లడించాడు. బుమ్రా బౌలింగ్ శైలి గురించి చెప్పేటప్పుడు డుప్లెసిస్ మరో ఆసక్తికర పోలిక కూడా చేశాడు. ఒకప్పుడు లసిత్ మలింగా ఎలా విభిన్న యాక్షన్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడో, బుమ్రా సైతం తన ప్రత్యేక శైలితో అదే విధంగా బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడని చెప్పాడు. బంతి చేతి నుంచి ఎంత వేగంగా బయటకు వస్తుందో అంచనా వేయడం బ్యాటర్లకు చాలా కష్టమని వివరించాడు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!