Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact Check: గత కొన్ని రోజులుగా విజయ్ ‘జన నాయగన్’ సినిమా లీక్ గురించి వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కార్యాలయం నుంచే లీక్ అయిందన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపగా ఈ ఆరోపణలను సెన్సార్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
Also Read
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం, ఒక సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే సాంకేతికత గురించి CBFC కీలక విషయాలను వెల్లడించింది. సినిమాల సర్టిఫికేషన్ కోసం CBFC కేవలం సురక్షితమైన KDM వ్యవస్థను మాత్రమే అనుసరిస్తుంది. సినిమాలో ఉన్న కంటెంట్ మొత్తం పాస్‌వర్డ్ ద్వారా రక్షించబడుతుంది. ఈ పాస్‌వర్డ్/ యాక్సెస్ కీ కేవలం నిర్మాత వద్ద మాత్రమే ఉంటుంది. సరైన KDM కోడ్ లేకుండా ఆ సినిమాను చూడటం కానీ, డౌన్‌లోడ్ చేయడం కానీ ఎవరికీ సాధ్యపడదు. బోర్డు సభ్యులు కూడా కేవలం రివ్యూ కోసం మాత్రమే ఆ ఫైల్‌ను యాక్సెస్ చేయగలరు.
ఇక సెన్సార్ బోర్డు చెబుతున్న ప్రకారం మార్చి 17వ తేదీన ముంబైలో ఈ సినిమా DCPని అధికారికంగా దరఖాస్తుదారుడైన నిర్మాతక అప్పగించడం జరిగింది. దానికి సంబంధించిన రశీదు కూడా బోర్డు వద్ద ఉంది. ఆ రోజు నుంచి ఈ డిజిటల్ ప్యాకేజీ మొత్తం నిర్మాత పర్యవేక్షణలోనే ఉందని, బోర్డు బాధ్యత సర్టిఫికేషన్ పూర్తయిన వెంటనే ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలో ‘జన నాయకన్’ చిత్రం CBFC నుండి లీక్ అయిందనే వార్తలు కేవలం కల్పితమని, వాటిని ఎవరూ నమ్మకూడదని CBFC వర్గాలు కోరుతున్నాయి.
READ ALSO: Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!