Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: గొప్ప విద్వాంసుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, ప్రకృతిలోని జంతువులు, పక్షుల నుంచి కూడా మనం కొన్ని గొప్ప గుణాలను నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒక మనిషి విజయం సాధించాలంటే ‘కొంగ’ (బగుల) నుంచి ఒక అద్భుతమైన లక్షణాన్ని అలవర్చుకోవాలని చాణక్యుడు ఈ క్రింది శ్లోకం ద్వారా వివరించారు.
READ ALSO: Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ఇంద్రియాణి చ సంయమ్య బకవత్పండితో నరః
దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్
కొంగ నుంచి నేర్చుకోవాల్సిన ఆ గుణం ఇదే..
కొంగ చేపను వేటాడేటప్పుడు నీటిలో అత్యంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో నిలబడుతుంది. దాని దృష్టి మొత్తం తన లక్ష్యం (చేప) పైనే ఉంటుంది. చేప దొరికే వరకు అది తొందరపడదు, అసహనానికి గురికాదు. సరైన సమయం కోసం వేచి చూసి, అవకాశం దొరకగానే మెరుపు వేగంతో తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. అదేవిధంగా ఒక జ్ఞాని అయిన వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, కొంగలాగా తన లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతను నిలపాలని చాణక్యుడు బోధించారు.
ఏదైనా ఒక కార్యాన్ని సాధించే ముందు మనిషి ఈ అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని చాణక్యుడు సూచించారు. మీరు పనిచేస్తున్న ప్రాంతం ఏది?, అక్కడ ఆ పనికి ఎంతవరకు ఆస్కారం ఉంది?, ఆ స్థలం మీ విజయానికి సహకరిస్తుందా లేదా? అనే అవగాహన ఉండాలి. ఆ పని చేయడానికి ఇది సరైన సమయమేనా?, ప్రతి పనికి ఒక అనుకూల సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు ఓపికగా వేచి చూడటం ముఖ్యం. మీ సామర్థ్యం ఎంత?, మీ దగ్గర ఉన్న వనరులు, ఆర్థిక బలం ఎంత? మీ శత్రువు లేదా పోటీదారుడి బలం ఎంత? వీటిని సరిగ్గా అంచనా వేయగలిగినప్పుడే విజయం సాధ్యమవుతుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని బాధలు పడుతుంటారు. కానీ చాణక్యుడు చెప్పినట్లుగా కొంగలాంటి ఏకాగ్రత, సహనం కలిగి ఉండి.. దేశ, కాల, బలాలను అంచనా వేసి అడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించడం తథ్యం అని పెద్దలు చెబుతున్నారు .
తాజావార్తలు
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!