ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఫన్‍టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‍గా 2022లో ఎఫ్3 మూవీ కూడా తెరకెక్కింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎఫ్2 సినిమాను బాలీవుడ్‍లో తెరకెక్కించాలని నిర్మాత దిల్‍రాజు నిర్ణయించినట్లు సమాచారం.బాలీవుడ్ లో ఈ సినిమాను ఓ సీనియర్ స్టార్ హీరో తో అలాగే ఓ యంగ్ హీరో తో కలిపి అక్కడ నేటివిటీ కి తగ్గట్టుగా సినిమాను కొద్దిగా మార్పులు చేసి బాలీవుడ్‍లో నిర్మించాలని దిల్‍రాజు డిసైడ్ అయినట్టు సమాచారం.. ఎఫ్2 సినిమా సబ్జెక్ట్ బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుందని దిల్‍రాజు భావిస్తున్నారట. ఎఫ్2 హిందీ రీమేక్‍కు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వస్తుందని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ బయటికి వచ్చింది.
రెండు జనరేషన్లకు చెందిన ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలను ఎఫ్2 కోసం తీసుకోవాలని దిల్‍రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఎఫ్2 హిందీ రీమేక్‍కు కూడా అనిల్ రావిపూడినే దర్శకత్వం వహించనున్నారని సమాచారం.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉందని తెలుస్తుంది.త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మొత్తంగా ఎఫ్ 2 సినిమా ఫుల్ కామెడీతో టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచింది. సుమారు రూ.30కోట్ల బడ్జెత్‍తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.120కోట్లకు పైగా రాబట్టి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.అయితే దిల్‍రాజు ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు.భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది. వచ్చే ఏడాది గేమ్ చేంజర్ సినిమా ను రిలీజ్ చేయాలని దిల్‍రాజు భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.