Pushpa 2: పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రేంజ్ హిట్ తీసుకొచ్చిందో తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప పాటలు ఏ రెంజ్లో ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారంటే ఇప్పటికీ అవి ఎక్కడో చోట మోగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ పాట యూత్ కు మంచి కిక్కిచ్చింది. దీంతో సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ఆడియోపై కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Also: Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్.. హమాస్‌పై వైమానిక దాడులు..
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే అయితే ఈ మూవీ ఆడియో రైట్స్ ఏకంగా రూ. 65 కోట్ల భారీ ధరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే ఇండియన్ సినిమాల్లో ఇది పెద్ద రికార్డు అనే చెప్పాలి. ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ భండారి, ధనుంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
Read Also:Narasimha Stotram: అనుకున్న పనులు జరగాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి