ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒకేసారి తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటుందని ఓ అధ్యయనం తెలిపింది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమన్నారు. 2023లో చోటు చేసుకున్న వాతావరణ పరిణామాలపై పరిశోధకులు సమీక్ష చేశారు. గత సంవత్సరంలో ఉత్పన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న భూతాపంపై వేసిన అంచనాలకు తగ్గట్టే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా 2023 నిలిచిందన్నారు. భవిష్యత్‌లో మరింత వేడి వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలను కురిపించే తుఫాన్లు సర్వసాధారణం అవుతాయన్నారు.
Read Also: MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
ఇక, ఈ అసాధారణ వాతావరణంతో రుతువుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయవ్య ఐరోపా, బ్రెజిల్, మొరాకో, దక్షిణాఫ్రికాలో వసంత రుతువులోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. ఈ సీజన్‌లో ఇలాంటి పరిస్థితి చాలా అసాధారణమని ఓ బ్రిటన్ వాతావరణశాఖ పరిశోధకుడు చెప్పారు. ఈ ప్రపంచంలో ఏకకాలంలో భిన్న ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయన్నారు. గత ఏడాది ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలో జులై నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇక, తుఫాన్ల వల్ల తీవ్రస్థాయిలో వర్షాలు పెరిగిపోతాయి.. 2023 జులైలో ఉత్తర చైనాలో, సెప్టెంబరులో లిబియాలో వచ్చిన వరదలు దీనికి నిదర్శనం అని చెప్పారు. భూతాపం పెరగడం వల్ల ఏర్పాడే పరిస్థితులు భవిష్యత్‌లో జరిగే పరిణామాలపై ఇది తీవ్ర ప్రభావం చూస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.