Rajasthan Weather : రాజస్థాన్ మరోసారి భయంకరమైన వేడికి చిక్కుకుంది. మౌంట్ అబూ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. మౌంట్ అబూలో గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీలు కాగా, రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో మండుతున్న వేడి తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది.
Weather : వాయువ్య భారతం విపరీతమైన వేడిని ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.