Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు ఓ డెడ్ బాడీ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు.. అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు గుర్తించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తిని కలిగిరి మండలంలోని వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీకాంత్‌గా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు మేదరమెట్ల శ్రీకాంత్ మృతికి ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ మహిళ కోసం సెర్చ్ చేసే సమయంలో హత్య జరిగిన చోట టవర్ డంప్ చూడగా.. స్పాట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
వెంగమ్మకు.. మృతుడు శ్రీకాంత్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. శ్రీకాంత్‌కి తెలియకుండా వెంగమ్మ మరో ఇద్దరితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో శ్రీకాంత్‌కి తెలిసి నిలదీశాడు. దీంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది. అతనికి మే 15న స్పాట్ పెట్టీ ఫోన్ చేశారు. కానీ శ్రీకాంత్ స్పందించలేదు.. దీంతో మరుసటి రోజు మరోసారి ఫోన్ చేయగా వింజమూరులోని వింజటమ్మ కొండ సమీపానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న హరిబాబు, ప్రదీప్‌ను పిలిపించి అతన్ని కత్తితో పొడిచి చంపించేసింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఎలాంటి క్లూ లేని ఈ కేసులో కలిగిరి పోలీసులు సాంకేతికతను ఉపయోగించి మృతుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతని ఫోన్ డేటా సేకరించి మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాంత్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని.. మరో ఇద్దరితో కూడా సంబంధం ఉండటంతో తనకు, శ్రీకాంత్ కి మనస్పర్ధలు వచ్చాయని విచారణలో నిందితురాలు చెప్పింది. అడ్డుగా ఉన్నాడని ఇద్దరు యువకులతో కలిసి చంపేసినట్లు నేరం ఒప్పుకుంది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు పోలీసులు. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు తప్పించుకోవాలని చూసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..