భారత్ కు పాకిస్తాన్, చైనాతో ఎన్నో ఏళ్లుగా సరిహద్దు వివాదాలు ఉన్న విషయం తెలిసేందే. వీలు చిక్కితే చాలు చైనా భారత్ పై కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది కెనడా. ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధమైన వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా భారత్-చైనా సంబంధాలపై ఎదురైన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సమాధానమిచ్చారు.
Also Read: Bigg Boss Telugu 7: బిగ్ బాస్ లో ప్రమాదం.. దెబ్బ తగలడంతో కుప్పకూలిపోయిన రైతుబిడ్డ..
2020 గల్వాల్ లోయ ఘర్షణ తర్వాత నుంచి భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా బాగోలేదని ఆయన పేర్కొ్న్నారు. రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి తాలూకూ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్న ఆయన ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చన్నారు. చైనా ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదని జై శంకర్ అన్నారు. గత మూడేళ్ల కాలాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు సహజరీతిలో లేవన్నారు.
రెండు దేశాల మధ్య సంప్రదింపులకు విఘాతం కలిగిందన్న ఆయన, రెండు దేశాల మధ్య పర్యటనలు ఆగిపోయాయన్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తత నెలకొందని పేర్కొ్న్నన్నారు. చైనా అంటే భారత ప్రజలకు ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని పేర్కొన్న ఆయన ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. 1962 లో చైనా భారత్ మధ్య యుద్దం జరిగిందని పేర్కొన్న ఆయన ఆ తరువాత సైనిక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే 1975 తరువాత సరిహద్దుల్లో ఎప్పుడూ ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
ఇక 1988 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనాలో పర్యటించిన తరువాత భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు. వివాదాస్పద సరిహద్దు విషయమై 1993లో, 1996లో చైనాతో భారత్ రెండు ఒప్పందాలు చేసుకుందని జై శంకర్ వెల్లడించారు. వీటిపై చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొ్న్నారు. ఇక చైనా తన సైన్యాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటుందని అందుకే దానితో జాగ్రత్తగా ఉండాలని అగ్రరాజ్యం ప్రపంచ దేశాలను హెచ్చరించిన విషయం తెలిసిందే.