బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటాపోటీ తలపడుతున్నారు.. గత ఎపిసోడ్స్ కు సంబందించి ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్… బ్యాంకర్స్ గా శివాజీ, సందీప్, శోభా వ్యవహరిస్తారని చెప్పాడు.. ఈ క్రమంలో కాయిన్స్ ను సేకరించాలి.. ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్లే విన్నర్స్.. పవర్ అస్త్ర వారికే సొంతం..
ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఏటిఎం ఏర్పాటు చేశారు. బజర్ మోగిన వెంటనే పరుగెత్తుకెళ్లి ఏటీఎం కి ఉన్న బటన్ ని ప్రెస్ చేయాలి. ఈ టాస్క్ లో అందరూ బటన్ నొక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగలడంతో అతడు పక్కకు వచ్చేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు. కంటెస్టెంట్స్ అందరు అతనికి ఏమైందో అని టెన్షన్ పడుతుంటారు..ఇక అమర్ దీప్ మాత్రం బజర్ ను నొక్కింది తానే అని గట్టిగా వాదిస్తాడు..
ఇక పల్లవి ప్రశాంత్ కు ఏ మేర గాయమైంది.. ఎలా తగిలింది అనేది ఈ ఎపిసోడ్ లో చూస్తే తెలుస్తుంది.. ఇదంతా లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.. ఈరోజు ప్రసారం అవుతున్న ఎపిసోడ్ లో చూడొచ్చు.. ఇక ఈ వారానికి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. తేజా, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటిని వీడనున్నారు.. ఇక పోతే ఈ వారంలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వైల్డ్ కార్డు ద్వారా కూడా కొందరు సెలెబ్రేటీలు రానున్నారని ప్రచారం జరుగుతుంది.. ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందేమో చూడాలి మరి..