Tamil Nadu: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు కార్మికుల మృతి
- రసాయణాలు.. ముడిపదార్థాలు నిర్వహించడంలో నిర్లక్ష్యమే కారణమని అధికారుల ప్రాథమిక అంచనా
- అసలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు
- గత నెలలో వీరేద్నగర్లోని శివాక్సీ కర్మాగారంలో ఇదే విధమైన పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్లో పేలుగు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అచ్చంకుళంలోని చతుర్ తాలూకాకు చెందిన సహదేవ్ టీఆర్వో (TRO) లైసెన్స్‌తో తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యూనిట్లో ఉంచిన రసాయనాలు, ఇతర ముడి పదార్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఇంకా తెలియరాలేదని తెలిపారు.
READ MORE: Monsoon Update: గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
గత నెలలో వీరేద్నగర్లోని శివాక్సీ ప్రాంతం బాణసంచా కర్మాగారంలో ఇదే విధమైన పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందడం గమనార్హం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి వారికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఇదే జిల్లాలో మరో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడులో 10 మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మృతుల బంధువులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!