NTV Telugu Site icon

Hyderabad Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కసరత్తు

Hyderabad Traffic

Hyderabad Traffic

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం సిద్దం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం హైటెక్ కంపనీ లతో అనుసంధానం కానుంది కమిటీ. అయితే… ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో అత్యవసర భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు సమావేశమయ్యారు.

Illegal Affair: 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్..

GHMC పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఆమ్రపాలి కాట.. మాన్సూన్ ఎనర్జన్సీ బృందాలను అప్రమత్తం చేసి వాటర్ లాగింగ్ పాయింట్ లా వద్ద నిలిచిన నీరును వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కమిషనర్.. నిలిచిన వరద నీరులో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదని ఎవరు నడవవద్దని ద్విచక్ర వాహనాలను నడపవద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇంటి వద్దనే ఉండాలని అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ సంప్రదించాలని నగరవాసులకు సూచించారు కమిషనర్ ఆమ్రపాలి కాట..

Satyam Sundaram: ట్రైలర్’లో ఏం ఫీల్ ఉంది మావా!