Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!
- మంత్రి సుభాష్ తండ్రిపై శీలి గ్రామ మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు
- మంత్రి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టాడు
- గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తనపై జరిగిన దాడి ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తనను దారుణంగా కొట్టారని చెప్పాడు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని.. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారని తెలిపాడు. వదిలేయమని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలాడినా వినిపించుకోలేదని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బోరున ఏడ్చాడు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
‘మంత్రి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టారు. గ్రామ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో ప్రశ్నించానని పిలిపిస్తే వెళ్ళాను. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారు. నేను టీడీపీ కార్యకర్తను, వైసీపీలో నుంచి వచ్చిన వాళ్లకు పదవి ఇచ్చారని ప్రశ్నించాను. నాతో రాత్రి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. నన్ను వదిలేయమని మంత్రి తండ్రి సత్యం కాళ్లు పట్టుకుని బతిమాలాను. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. డాక్టర్‌ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించి నన్ను పంపించేశారు. మంత్రి సుభాష్ నా కొడుక్కి ఉద్యోగం ఇస్తాను, ఈ విషయాన్ని వదిలేయండని అంటున్నారు. ఇప్పుడు రామచంద్రపురం సీఐ వచ్చి నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిందని చెప్తున్నారు’ అని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!