Ponguleti Srinivas Reddy: నా మామిడితోట ఎక్కడుందో చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి వాది మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బిఆర్ఎస్ నేతలకు మధ్య మామిడి తోట వివాదం కొనసాగుతుంది. అయితే ఆ మామిడి తోట వివాదానికి పొంగులేటి పుల్ స్టాఫ్ పెట్టారు. మామిడి తోట ఎక్కడుందో చెప్పండి అంటూ సవాల్ కూడా విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గాల వారీగా అసంతృప్తి సమావేశాలను ఆత్మీయ సమావేశాల పేరుతో పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తన వర్గం అభ్యర్ధులను కూడా ప్రకటించేస్తున్నారు. దీంతో పోటీ గా అన్నినియోజకవర్గాల్లో అభ్యర్ధులను పెడతారని స్పష్టం అయ్యింది.
Read Also: Suman: 16న మంగళూరులో హీరో సుమన్ కు ఘన సన్మానం!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే భవిష్యత్ లో తాను ఏ పార్టీలో ఉన్నప్పటికి ఈ టీమ్ ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ 24 గంటల విద్యుత్ రావడం లేదని తెలంగాణ వచ్చినప్పటికి ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని అంటున్నారు. ఈ సందర్బంగా పంటలు ఎండిపోయి రైతులు ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వంపై విమర్శానాస్ర్టాలను ఎక్కుపెడుతున్నారు. అయితే కరెంటు ఎక్కడ రావడం లేదో చెప్పాలని బిఆర్ఎస్ నేతలు కూడ పొంగులేటికి ధీటుగా సమాదానాలను ఇస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని పొంగులేటి అంటున్నారని ఆయన స్వంత గ్రామం నారాయణ పురంలో నలభై ఎకరాల మామిడి తోటలకు నీళ్లు అందుతున్నది నిజం కాదా అంటూ పదే పదే పొంగులేటిని ఉద్దేశించి బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే వారికి ఈ రోజు పొంగులేటి సమాధానం కూడా చెప్పారు. తన గ్రామం నారాయణ పురంలో ప్రభుత్వానికి చెందిన వారితో ఈ నెల మొదటి వారంలో సర్వే చేశారని తనకు మామిడి తోట ఎక్కడుందని ప్రశ్నించారు. మామిడి తోటకు నీళ్లెక్కడ ఇస్తున్నారంటూ పొంగులేటి వైరాలో ఆత్మీయ సమావేశంలో సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు చెబుతున్న మామిడి తోట వ్యవహారానికి సంబంధించి పొంగులేటి సవాల్ విసిరినట్లుగా మారింది. మరి బిఆర్ఎస్ నేతలు పొంగులేటి మామిడి తోట పై ఎలాంటి కామెంట్లు చేస్తారు. మళ్లీ ఎటువంటి ఆరోపణలు చేస్తారో చూడాల్సి ఉంది.
Read Also: INDWvsWIW: టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియా బౌలింగ్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!