INDWvsWIW: టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియా బౌలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హర్మన్‌సేన అదే జోరుతో రెండో మ్యాచ్‌కు రెఢీ అయింది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ రేసులో మరింత ముందంజ వేయాలని భారత జట్టు భావిస్తోంది. విమెన్స్ ఐపీఎల్ వేలంలో కాసుల వర్షంతో సంతోషంలో ఉన్న మహిళా క్రికెటర్లు ఈ ఊపును ఈ మ్యాచ్‌లో కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన విండీస్ ఎలాగైనా ఈ పోరులో గెలవాలన్న పట్టులదతో ఉంది. దీంతో ఇరుజట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఆడుతోంది.
పాక్‌పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా.. విండీస్‌పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్‌ప్రీత్ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్ జోరు ముందు విండీస్ నిలవడం కష్టమే. పాక్‌పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
భారత జట్టు: స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్
వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), స్టేఫానీ టేలర్, క్యాంప్‌బెల్, షబికా గజ్నబీ, చినెల్లే హెన్రీ, చెడియాన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షమిలియా కానెల్, రషదా విలియమ్స్, కరిష్మ రామ్రాక్, షకీరా సెల్మాన్
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!