Suman: 16న మంగళూరులో హీరో సుమన్ కు ఘన సన్మానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suman:ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనదైన బాణీ పలికించిన సుమన్ ఈ యేడాదితో నటునిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న సుమన్ కు మంగళూరులో ఘనసన్మానం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు మరో ఐదు భాషల్లోనూ సుమన్ నటించారు. దాదాపు 700 చిత్రాలలో నటించిన సుమన్ కు ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. చిరంజీవి, సుమన్ దాదాపుగా ఒకే సమయంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. ఇద్దరూ యాక్షన్ హీరోలుగా మంచి పేరు సంపాదించారు. ఇక రజనీకాంత్ వీరిద్దరి కంటే కొంత సీనియర్. రజనీకాంత్ తో కలసి సుమన్ కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తొలి చిత్రం ‘శివాజీ’లో సుమన్ ప్రతినాయకునిగా తనదైన బాణీ పలికించారు.

Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
సుమన్ తొలిసారి కెమెరా ముందు నటించిన ‘నీచల్ కులమ్’ అనే తమిళ చిత్రం 1978లో షూటింగ్ మొదలు పెట్టుకుంది. 1979లో ఈ చిత్రం వెలుగు చూసింది. ఆ రోజుల్లో కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షియల్ఆర్ట్స్ లో సుమన్ ప్రావీణ్యం సంపాదించి, తనదైన యాక్షన్ తో జనాన్ని అలరిస్తూ సాగారు. మరో యాక్షన్ భానుచందర్ కూడా మార్షియల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. సుమన్, భానుచందర్ మంచి మిత్రులు. భానుచందర్ ద్వారానే సుమన్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు పరిచయం అయ్యారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో సుమన్ తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆ సినిమా కంటే ముందు కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుమన్ హీరోగా ‘తరంగిణి’ చిత్రం విడుదలయింది. తొలి సినిమాతోనే సుమన్ తెలుగువారికి చేరువయ్యారు. ఆ చిత్రం స్వర్ణోత్సవం జరుపుకుంది. తరువాత ‘నేటి భారతం’ కూడా రజతోత్సవాలు చూడడంతో సుమన్ తెలుగునాట స్టార్ హీరోస్ లో ఒకరిగా గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచీ తెలుగు చిత్రాలకే ప్రాధాన్యమిస్తూ సాగారు సుమన్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగునాట విజయపథంలో పయనించాయి. “మెరుపుదాడి, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, సితార, దేశంలో దొంగలు పడ్డారు, నేరం నాదికాదు, పెద్దింటి అల్లుడు, ఖైదీ ఇన్ స్పెక్టర్, బావ-బావమరిది, 20వ శతాబ్దం” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. వీటిలో ‘బావ-బావమరిది’ చిత్రం ద్వారా ఉత్తమ నటునిగా నంది అవార్డునూ అందుకున్నారాయన.

సుమన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్న సమయంలో ఆయనపై కొన్ని నీలినీడలు కమ్ముకున్నాయి. దాంతో కొంతకాలం చేయని నేరానికి కటకటాల వెనక్కు వెళ్ళారు. అయినా సుమన్ నిర్దోషి అని నమ్మిన నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో సుమన్ ‘బందిపోటు, నేరం నాది కాదు, ఉక్కుసంకెళ్ళు’ వంటి యాక్షన్ మూవీస్ తో అలరించి, మళ్ళీ ప్రేక్షకులకు చేరువయ్యారు. తన కెరీర్ లో అన్ని సినిమాలు ఓ ఎత్తు ఒక్క ‘అన్నమయ్య’ సినిమా మరో ఎత్తు అని సుమన్ తరచూ చెప్పేవారు. ‘అన్నమయ్య’ చిత్రంలో వేంకటేశ్వర స్వామి పాత్రను పోషించే అవకాశం లభించగానే, ఆయన దశ మారిపోయింది. కొన్ని పౌరాణిక పాత్రలు పోషించే ఛాన్స్ దక్కింది. ‘శ్రీరామదాసు’లో శ్రీరామునిగా, ‘దేవుళ్ళు’లో వేంకటేశ్వరునిగా, ‘గౌతమబుద్ధ’లో బింబిసారునిగా నటించారు. కెరీర్ ప్రారంభంలో ప్రతినాయక పాత్రలు పోషించిన సుమన్ తరువాత రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన ‘శివాజీ’లోనూ విలన్ గా మెప్పించారు. హీరోగా అవకాశాలు తగ్గగానే సుమన్ కేరెక్టర్ రోల్స్ వైపు టర్న్ తీసుకున్నారు. అప్పటి నుంచీ తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయంచేస్తూ సాగుతున్నారు. నటునిగా 45 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సుమన్ మరిన్ని వసంతాలు చూస్తూ, మరిన్ని పాత్రలలో అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!