మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు…