Site icon NTV Telugu

Jogu Ramanna: బీజేపీ నేతలపై మాజీమంత్రి జోగురామన్న సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే..?

Jogu Ramanna

Jogu Ramanna

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. అదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ” వీరికి గతంలో దొంగ నోట్ల దందాలో సంబంధాలున్నాయి. ఇక్కడ మోసాలు చేసి ఉగాండా లో పెట్టు బడులు పెడుతున్నారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ వ్యాపారులను బతకనివ్వరు. బీజేపీ నేతల వసూళ్ల పై ఎలాంటి చర్చకైనా సిద్ధం. P అంటే పాయల్ శంకర్,A అశోక్,N నగేశ్. ఈ ముగ్గురు వసూళ్లకు తెరలేపారు. P A N ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. బీజేపి నేతల భాగోతం బయట పడ్డది. దొంగ డ్రామాలు చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Saudi Arab : సౌదీ అరేబియాలో అంతుపట్టని వ్యాధి.. మూడు కేసులు నమోదు, ఒకరు మృతి

మతం పేరు తో డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీజేపి నేతలకు భక్తి అంటే తెలియదన్నారు. 12 ఎంపీ స్థానాలు గెలుస్తాం.. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో రాష్ట్రం లో మళ్ళీ కేసీఆర్ రాజ్యం రావడం ఖాయమన్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా తాజాగా జోగురామన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలను చర్చకు రమ్మంటూ.. జోగు రామన్న చేసిన సవాల్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Exit mobile version