Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ex Cji Br Gavai Reveals Backlash From His Own Community Over Creamy Layer Verdict For Sc Reservations

BR Gavai: క్రిమిలేయర్ తీర్పుతో సొంత వర్గం నుంచే విమర్శలు.. మాజీ సిజేఐ సంచలన వ్యాఖ్యలు

Published Date :December 7, 2025 , 6:10 pm
By Chandra Shekhar Pamena
  • రిజర్వేషన్లపై మాజీ సీజేఐ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు..
  • SC/STలో క్రిమిలేయర్ తీర్పుతో సొంత వర్గం నుంచే విమర్శలు..
  • ఆర్థికంగా పురోగతి సాధించిన వారిని రిజర్వేషన్ నుంచి తప్పించాల్సిందే: బీఆర్ గవాయ్
BR Gavai: క్రిమిలేయర్ తీర్పుతో సొంత వర్గం నుంచే విమర్శలు.. మాజీ సిజేఐ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

BR Gavai: ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ’ అంశంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లలో “క్రీమీ లేయర్” సూత్రాన్ని అమలు చేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత కులం నుంచే విమర్శలను ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఇతర వెనుకబడిన వర్గాల (OBC) కోసం అమలు చేస్తున్నట్లే SC/STల్లో కూడా ఆర్థికంగా పురోగతి సాధించిన వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. OBCలకు వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు పైబడి ఉంటే రిజర్వేషన్ అర్హత కోల్పోయే విధంగా చట్టం ఉందని గుర్తు చేశారు. అలాంటి విధానమే SC/STలకు కూడా వర్తించాలనే గవాయ్ పేర్కొన్నారు.

Read Also: Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్

అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వంటి రాజ్యాంగపరమైన పదవులకు రిజర్వేషన్ వర్తించదన్న సంగతి కూడా విమర్శకులు గుర్తించలేదని మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా ఎదిగి న్యాయమూర్తినైనా.. కాబట్టి, దేశంలో SC/STల్లో ఆర్థికంగా ఎదిగిన వారిని రిజర్వేషన్‌ నుంచి తప్పించడం ద్వారా ఇంకా సమాజంలో కింది స్థాయిలో ఉన్న వారికి ఈ రిజర్వేషన్ల ఫలితాలు అందుతాయనే ఆలోచనతోనే ఈ తీర్పు ఇచ్చినట్లు తెలియజేశారు.

Read Also: Phone battery: చలికాలంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఎందుకు.?

అలాగే, సామాజికంగా వెనుకబడినవారికి ముందుకు రావడానికి ‘సైకిల్’ ఇచ్చినట్లుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గుర్తు చేశారు. శూన్య బిందువులో ఉన్నవారిని పదో కిలోమీటర్ దూరంలో ఉన్నవారి వద్దకు చేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. కానీ ఎప్పటికీ సైకిల్‌పై ప్రయాణిస్తూ కొత్తగా వచ్చే వారికి అవకాశం దూరం చేయాలనేది అంబేద్కర్ దృష్టికోణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక, 2024లో ఇచ్చిన కీలక తీర్పు గవాయ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ SC/ST వర్గాల్లో కూడా క్రీమీలేయర్ అమలు చేయాలని సూచించింది. 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు క్రీమిలేయర్ సూత్రాన్ని కేవలం OBCలకు మాత్రమే వర్తిస్తుందని విషయాన్ని పేర్కొంది. అలాగే, OBCల కోసం క్రీమిలేయర్ అమలు చేస్తున్నట్లే SC/STలకు ఎందుకు వర్తించకూడదు? అని బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BR Gavai
  • Creamy Layer Verdict
  • Dr BR Ambedkar
  • indian judiciary
  • Reservations

తాజావార్తలు

  • Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

  • Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చి హైకోర్టు..

  • Devara 2: దేవర 2.. అప్పటి వరకు ఆగాల్సిందే!

  • Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!

  • Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions