Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender Sensational Comments On Brs

Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు.. ఈటల కీలక వ్యాఖ్యలు

Published Date :September 14, 2023 , 1:26 pm
By NTV WebDesk
Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు.. ఈటల కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షకు ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా యావత్ తెలంగాణ జాతి కదిలిందన్నారు. తెలంగాణ శ్రేయస్సు కోరి జయశంకర్ లాంటి వారు తెలంగాణ స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారన్నారు. విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు ప్రాణాలు తెగించి పోరాడారని అన్నారు. ఆనాటి ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, తెలంగాణ ద్రోహుల కుట్రలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారని తెలిపారు. తమ చావుతోనైనా తెలంగాణ పురోగమించాలని ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి నుంచి మొదలు యాదిరెడ్డి లాంటివారు అనేకమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చెసుకోవద్దని అన్నారు.

తెలంగాణ చూడడానికి బ్రతికుండాలి అని సుష్మా స్వరాజ్ భరోసా కల్పించారని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో బీజేపీ పోరాడుతోందని, ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందులకు ఓర్చి కోచింగులు తీసుకొని చదువుకుంటుంటే.. వాళ్ల ఆశలపై నీళ్ల చల్లుతున్నారుని అన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ. 3016 ఇస్తానని మాటతప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణొస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ.. 17 ఎగ్జామ్స్ పేపర్లను లీక్ చేసి చదువుకుంటే ఉద్యోగాలు రావంటూ కేసీఆర్ యువతకు విషాదాన్ని మిగిల్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీకారులకే ఉద్యోగాలంటూ సందేశం ఇచ్చిండని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ అనుమతి తీసుకొని ఇందిరాపార్క్ వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపడితే బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని మండిప్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తోంది. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా కిషన్ రెడ్డి గారిపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని అన్నారు.

బీజేపీకి పోరాటాలు, కేసులు కొత్త కాదు.. ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ మొత్తం ఒక పోలీసు వలయంగా మారింది. అనేక పోరాటాల్లో భాగంగా బీజేవైఎం కార్యకర్తలను, బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రిక్రూట్ మెంట్ జరగలే.. కాని, పోలీసు రిక్రూట్ మెంట్ జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కాని ఆత్మగౌరవాన్ని కోల్పోరని, అన్యాయం జరిగితే బరిగీసి కొట్లాడుతారని అన్నారు. అంగన్ వాడీ టీచర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తే వీఏలను పురిగొల్పి కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో సమ్మె చేసిన ప్రతి సంఘం కన్నీళ్లు పెట్టుకుంది తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. కేసీఆర్ రాజ్యంలో సచివాలయానికి ఎమ్మెల్యేలకు, మీడియాకు, సంఘాలకు ఎంట్రీ లేదు. నిజాం తరహా పాలన నడుస్తోందని అన్నారు. బీజేపీ కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ దుర్మార్గ సర్కారు కాలగర్భంలో కలవక తప్పదని అన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే రైతులు, ప్రజల నుంచి 3 వేల ఎకరాల పైచిలుకు భూములను అక్రమంగా లాక్కున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.
Vijay Deverakonda: మాట నిలబెట్టుకుంటూ… 100 కుటుంబాలకి 100000 ఇచ్చాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • Etela Rajender
  • Etela Rajendersensational comments
  • Kishan‌Reddy

తాజావార్తలు

  • Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

  • Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions