వరంగల్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగు పెట్టాలంటే వైస్ ఛాన్సలర్ రమేష్ పర్మిషన్ అవసరం అని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాల్సిన వీసీ పోలీసులతో విద్యార్థులపై దాడి చేయించడం హేయమైన చర్య అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu Naidu Arrest Live Updates : భద్రత రీత్యాసెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు..
వైస్ ఛాన్సలర్ రమేష్ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి అని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమంతో సీఎం సీట్లో కూర్చున్న కేసిఆర్ ఉద్యమ చైతన్యాన్ని నీరుగారుస్తున్నారు.. కేసిఆర్ ఇక నీవు అధికారంలో ఉండేది డిసెంబర్ వరకే.. విద్యార్థి లోకాన్ని అవమానపరిస్తే ప్రతికారం తీర్చుకోకతప్పదు అని ఆయన తెలిపారు. వీసీ వైఖరి, పోలీసుల దాడికి నిరసనగా రేపు ( మంగళవారం ) విద్యార్థుల జిల్లా బంద్ కు భారతీయ జనతా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Gadwal MLA Case: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
అయితే, మరో వైపు కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్‌పై బహిరంగ విచారణ చేపట్టాలని, రిజిస్ట్రార్ శ్రీనివాసరావును బర్తరఫ్ చేయాలని కేయూ విద్యార్థి జేఏసీ నేతలు, విద్యార్థులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. విద్యార్థి జేఏసీ రేపు నిర్వహించ తలపెట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు తాము సపోర్ట్ ఇస్తున్నట్లు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రకటించారు.