Etela Rajender : మోడీ గ్యారంటీ- ఈటల ష్యూరిటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ పేరుతో విడుదల చేశారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మే 13 వ తారీకు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావంను మల్కాజిగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, యావత్ తెలంగాణ మోడీ ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదన్ని నిజం చేయాలని.. దాంట్లో మల్కాజిగిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పురించండం జరిగిందన్నారు.
అంతేకాకుండా.. ‘ఆంక్షలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు లక్షలాదిగా పాల్గొన్న తీరును చూపించిన ప్రేమకు తెలంగాణ ప్రజలకి కృతజ్ఞుడిగా ఉంటా అని నాగర్ కర్నూల్ సభలో, జగిత్యాల సభలో మోడీ గారు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఏ అకుంఠిత దీక్ష కోసమైతే పోరాడేమో అదంతా మీ కళ్ళ ముందు ఉంది. తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయం చూశారు. మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందుకి వచ్చాను. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నిరుద్యోగం. భారత ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాట ఇస్తున్నాను.
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
హైదరాబాదులో పేదవారికి స్థలం కొనే భాగ్యం లేకుండా పోయింది. సొంత ఇంటి కలగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 37 వేల ఇల్లు మంజూరు చేసిన వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైంది. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చిన పేదలతో సహా ఇక్కడ ఉండేవారికి సొంత ఇంటి కల నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కృషి చేస్తాను అని హామీ ఇస్తున్నాను. వైద్యం మీద పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిది. పేదవారికి వైద్య అవసరాల కోసం డబ్బులు లేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం మనుషులను పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ , ఎయిమ్స్ తో పాటువైద్య సౌకర్యాల కల్పనలో మరింత చేరువ చేసే ఏర్పాటు చేస్తానని ప్రజానీకానికి హామీ ఇస్తున్నాను. స్థానికంగా డ్రైనేజ్ , రోడ్లు, ట్రాన్స్పోర్ట్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ గారి సర్కారు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టి దండం పెట్టే అవసరం లేకుండా మీ బిడ్డగా వాటిని పరిష్కారం చేస్తాను హామీ ఇస్తున్నాను.’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?