Site icon NTV Telugu

Etela Rajender : మాటలకే పరిమితమైన ఎస్ఎల్బీసీ

Etela

Etela

నల్లగొండ జిల్లాలోని డిండి మండలం, చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ, ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సందర్బంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… ఎస్ఎల్బీసీ ఇరిగేషన్ పనుల జాప్యంలో సజీవ సాక్ష్యం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. మాటలకే ఎస్ఎల్బీసీ పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూ కాలువలు కుంటలు నింపితే ప్రాజెక్టులు నిర్మించినట్లా అని ఆయన ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడు కల్వకుర్తి చెరువుల నీళ్లు మాటలకే పరిమితమయ్యాయన్నారు.

Also Read : Tarakaratna: అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్.. వైరల్

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులేనని, నేడు ఏ ఒక్కటీ ప్రారంభించలేదని పనులు చేపట్టలేదని ఆయన వెల్లడించారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి డిండి ఎత్తిపోతల పనులకు అతిగతి లేదని, ఉత్తర తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతాన్ని చేశానంటున్నడు కేసీఆర్.. కన్నెపల్లి పంప్ హౌస్ కూలిపోయి ఆరు నెలలు కావస్తున్న…. మీడియాను సైతం పంపు వద్దకు రానివ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనే నీచమైన సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని ఆయన అన్నారు. లొంగకపోతే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read : Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్.. ఎంత పని చేశారో తెలుసా?

Exit mobile version