NTV Telugu Site icon

Etela Rajender : ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారు.. అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు

Etela Rajender

Etela Rajender

ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారని, అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు అన్నారు హజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌కి ఫోన్ చేసినా, జిల్లా మంత్రి కి ఫోన్ చేసిన స్పందన లేదని ఆయన ఆరోపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారని, అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవని ఆయన అన్నారు. ఎప్పుడో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్స్‌ను ఈ రోజు ప్రారంభిస్తున్నారంటే ఎంత సిగ్గుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ ను ఈ రోజు తిరిగి ప్రారంభిస్తున్నారని, ప్రజా గర్భంలో సునామీలా ఉంది, సందర్భం వచ్చినప్పుడు ప్రళయం వస్తుందని ఆయన అన్నారు.

Also Read : Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?

మహిళా గవర్నర్ ను అవమానించారని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది కేసీఆర్‌ నినాదం.. ఇది విని అశ్చర్యపోయా అని ఆయన అన్నారు. కేంద్ర పథకాలు అందకుండా చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చదువుకున్నారా? లేదా ? కేంద్రానికి మూడున్నర లక్షల కోట్లు ఇస్తే ఎంత తిరిగి వచ్చింది అని అడుగుతున్నారని ఈటల అన్నారు. హైదరాబాద్ ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24 జిల్లాలను సాదితే.. ఇప్పుడు ఆ ఆదాయం 10 జిల్లాలకే పంచుతున్నారని ఆయన అన్నారు.

Also Read : Thalapathy67: ‘మాస్టర్’ కోసం అధీరా ను దింపేసిన లోకేష్

హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడం లేదా ? ఈ మాత్రం సోయి లేదా? అని ఈటల ధ్వజమెత్తారు. ఒక లీటరు పెట్రోలు పోసుకుంటే.. 41.50 రూపాయలు రాష్ట్రానికి టాక్స్ కడితే.. 19.50 రూపాయలు కేంద్రానికి టాక్స్ కడుతున్నామని, పన్నులో ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం తిరిగి ఇస్తారన్నారు. ఇవన్నీ కేటీఆర్ కి తెలవదా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నారు అని మొన్న కేసీఆర్‌ మాట్లాడారని.. అది అచ్చం వారికే వర్తిస్తుందని ఈటల అన్నారు.