కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరిన నిర్మల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్ రెడ్డి కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహేశ్వరం రెడ్డికి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ లో ఘణంగా స్వాగతం పలికారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజలు కెసిఆర్ పై విసుగు చెంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ లో చేరాలి ప్రజల అశయ సాదనలో మా వంతు కృషి చెయ్యాలని ఇతర పార్టీ నాయకులు బీజేపీ లో చేరుతున్నారని అన్నారు. కెసిఆర్ ఒంటెద్దు పోకడలకు అధికార పార్టీ నాయకులు విసుగు చెందారని త్వరలో ఆధికార పార్టీ నుండి చేరికలు ఉంటాయని అన్నారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ….. కాంగ్రెస్ పార్టీని వీడి జెపి నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంతో నిర్మల్, అదిలాబాద్ తో పాటు తెలంగాణలో నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులారా నిర్ణయం తీసుకొండి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తారా? మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నిజాయతికి మారుపేరు అభివృద్ధిలో దేశానికి మంచిపేరు తెస్తున్న నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేస్తారా ఆలోచించండి అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మరి ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన నచ్చక అనేక మంది అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనది కాంగ్రెస్ రక్తం కాదు తెలుగు దేశం రక్తం అని అన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ నుండి బీజేపీ లో చేరికలు ఉంటాయి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ….. కాంగ్రెస్ పార్టీని వీడి నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నాకు ఇంతపెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.