కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కు తప్ప వేరే పార్టీకి ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారన్నారు. కష్ట సుఖాల్లో ఆదుకున్న ఈటలకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేస్తానాన్న ఈటలకు రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివి అన్నారు.
Also Read : Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
మా సారూ గెలువాలే, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలానేది ప్రజల నినాదమని, ఈటల రాజేందర్ నియోజక వర్గంలో లేకున్న ప్రజల కష్ట సుఖాల్లో నేను తోడు ఉన్నానన్నారు. మేమంటే హుజురాబాద్ ప్రజలకు ఇష్టం, వారంటే మాకు ఇష్టమన్నారు. కాబట్టే ఈటలను ఏడు సార్లు గెలిపించారని ఆమె వ్యాఖ్యానించారు. డిసెంబర్ 3న ఉప ఎన్నిక విజయమే మళ్ళీ రిపీట్ అవుతుందని ఈటల జమున ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Tarun Bhascker: పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు