Telangana High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రంగనాథ్‌కు భారీ జరిమానా విధింపు..
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా..
- కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది.
Also Read
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. యూసుఫ్‌గూడ భూమి వివాదానికి సంబంధించిన ఈ కేసులో హైడ్రా అధికారుల వ్యవహార శైలిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తదుపరి విచారణలో ఈ వ్యవహారంపై మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!