Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- కేశినేని బ్రదర్స్ వార్ లో కీలక పరిణామం..
- మాజీ ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేసిన ఎంపీ కేశినేని చిన్ని..
- సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ చిన్ని..
- మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కేశినేని సోదరుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చిన్ని చేసిన ఆరోపణల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఎంపీ కేశినేని చిన్ని తన ఫిర్యాదులో సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఉర్సా క్లస్టర్ భూముల కేటాయింపు అంశంతో పాటు కేశినేని చిన్ని కుటుంబానికి సంబంధించిన పలు విషయాలపై ఈడీ విచారణ జరపాలని కోరుతూ కేశినేని నాని లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు మరింత బహిరంగంగా మారాయి. మరోవైపు, గతంలో కేశినేని నాని కూడా చిన్ని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తన వాహన నంబర్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో చిన్ని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
ఇప్పుడు చిన్ని ఫిర్యాదుతో నానిపై కేసు నమోదు కావడం కేశినేని సోదరుల మధ్య కొనసాగుతున్న వివాదానికి మరో కొత్త మలుపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యవహారం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ, న్యాయపరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో ఆరోపణలపై తుది నిజానిజాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!