కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో నేడు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజురాబాద్ కు పంపించిందే కేసీఆర్ అని ఆమె ఆరోపించారు. ప్రణవ్ బాబు ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోనేనని ఆమె అన్నారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డి తో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించాడన్నారు. ప్రణవ్ బాబు, కౌశిక్ రెడ్డి ఇద్దరు పార్టీలు వేరు గాని రేపు ఎవరు గెలిచినా పోయేది ప్రగతిభవన్ కే అని ఆమె అన్నారు. రేపు వాళ్ళు డబ్బులు పంపించిన వీళ్ళు డబ్బులు పంపించిన వారు ఇద్దరు ఒక్కటేనని, అయినా మన హుజురాబాద్ ప్రజలు గొప్పవారు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతారు అనే నమ్మకం నాకుందన్నారు ఈటల జమున.
Also Read : World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయింపు
ఇదిలా ఉంటే.. హుజురాబాద్‌లో ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేసిన 594 నామినేషన్ల లిస్టులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఈటల రాజేందర్ సతీమణి జమున అప్లికేషన్లు ఉన్నాయి. సాగర్ నుంచి జానారెడ్డి నామినేషన్ వేయగా, హుజూరాబాద్ నుంచి ఈటల జమున నామినేషన్ వేశారు. కీలక పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నామినేషన్లు తిరస్కరణకు గురవ్వడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇరువురు నేతలు కూడా తమ అఫిడవిట్ లో బీఫాం సమర్పించకపోవడంతో నామినేషన్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈటల జమున ప్రతి ఎన్నికల్లో ముందస్తుగానే నామినేషన్ వేస్తారు. ఏదైనా పొరపాటు జరిగి ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆమె పోటీలో ఉండే విధంగా ప్రణాళికలో భాగం ఇది. కాగా జానా రెడ్డి కి మాత్రం తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంతో తనకు బీఫాం దక్కలేదు.
Also Read : Team India: టీమిండియా టాస్ గెలిస్తే ఏం చేయాలి..? మాజీ క్రికెటర్ సలహా