Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం సీఎస్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్‌కు కీలక పదవి కట్టబెట్టారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. సీఎం ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్‌ను నియమించారు.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రధాన సలహాదారుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కేబినేట్ హోదాతో నియమించారు.. మూడు సంవత్సరాల కాలం పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు సోమేష్ కుమార్.
కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించిన ఆయన్ను.. ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తూ తీర్పు వెలువరించడం.. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయాయి.. ఇక, ఆ తర్వాత సోమేష్ కుమార్ జనవరి 12న ఏపీలో రిపోర్టు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌ను కూడా కలిశారు. అయితే.. ఇంతా జరిగి దాదాపు నెల రోజులైనా.. సోమేష్ కుమార్‌కు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు.. ఆయన విజ్ఞప్తి మేరకే ఏపీ సర్కార్ ఎలాంటి పోస్ట్ ఇవ్వలేదని ప్రచారం సాగింది.. ఇక, సోమేష్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.. ఆయన వీఆర్‌ఎస్‌కు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పుడు సోమేష్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్.. కాగా, సోమేష్ కుమార్ తెలంగాణలో పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు.. తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. సోమేష్ కుమార్ ఏపీ కేడర్‌కు చెందిన అధికారి అంటూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో.. ఆయనను సీఎస్‌గా తొలగించి.. ఆమె స్థానంలో శాంతి కుమారిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం.. కానీ, ఏపీకి వెళ్లటం ఎంత మాత్రం ఇష్టంలేని సోమేష్ కుమార్.. కోర్టు ఆదేశాల మేరకే అక్కడ రిపోర్ట్ చేసినా.. ఆ తర్వాత వీఆర్‌ఎస్ తీసుకున్నారు.. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన పదవికాలం ఉన్నా.. ఏపీలో రిపోర్ట్ చేసిన నెల రోజులకే వీఆర్ఎస్ తీసుకున్నారు.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేయబోతున్నారు.. కాగా, సీఎం కేసీఆర్‌తో సోమేష్ కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు.