NTV Telugu Site icon

Eshwar: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి

Eshwar

Eshwar

Eshwar: అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు “సైడ్ ఆర్మ్ త్రో” బౌలర్‌గా ఈశ్వర్‌ సేవలు అందిస్తున్నారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఈశ్వర్ ఇంటి వద్ద ఈశ్వర్ మృతదేహానికి క్రికెటర్ శ్రీకర్ భరత్ నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ వంటి క్రికెటర్లు ఈశ్వర్‌ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Als Read: Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు

భారత మాజీ ఆటగాడు వేణుగోపాలరావు ప్రోత్సాహంతో స్టార్ క్రికెటర్లకు ఈశ్వర్‌ దగ్గరయ్యాడు. ఇలా దగ్గరైన ఈశ్వర్‌ వారికి ఐపీఎల్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు బౌలింగ్‌ చేసేవాడు. ఈశ్వర్‌ విశాఖలోని గాజువాకకు చెందిన పేదకుటుంబంలో నుంచి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఈశ్వర్‌ కుటుంబం ఆర్థికంగా వెనుకబడినట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.