Jailer Vinayakan: సమాజంలో ఒక సాధారణ వ్యక్తి తప్పు చేయడానికి, ఒక సెలబ్రిటీ తప్పు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో వారు ఎలాంటి తప్పు చేసినా అది వారి కెరీర్ నే దెబ్బ తీస్తుంది. అయితే ఇక్కడ.. సెలబ్రిటీ అవ్వకముందు వరకు ఒక నటుడు చేసిన తప్పును మర్చిపోయిన నెటిజన్స్ .. అతను సెలబ్రిటీగా మారక మళ్లీ ఆ తప్పును తిరగతోడి అతనిని విమర్శిస్తున్నారు. అతడు ఎవరో కాదు.. నటుడు వినాయకన్. ఈ పేరు గత కొన్ని రోజులుగా చాలా గట్టిగ వినిపిస్తున్న విషయం తెల్సిందే. జైలర్ లో రజినీకాంత్ కు ధీటుగా విళబీజాన్ని చూపించిన నటుడే వినాయకన్. ముఖ్యంగా వర్మ ప్లే లిస్ట్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. మొదటి చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ చేసిన వినాయకన్ .. ఇప్పుడు జైలర్ సినిమాతో ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో అతడి నటనను ప్రశంసిస్తున్న నేపథ్యంలో కొంతమంది మాత్రం అతడి పాస్ట్ లో ఉన్న ఒక లైంగిక వేధింపుల కేసును తిరిగితోడి వైరల్ గా మారుస్తున్నారు.
A.S. Ravi Kumar Chowdary: ఏరా.. గోపీచంద్.. అంత బలిసిందారా నీకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
అస్సలు ఆ కేసు ఏంటి.. అంటే.. 2019 లో వినాయకన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. మృదుల దేవి అనే మోడల్ తో అతను ఫోన్ లో అసభ్యంగా మాట్లాడాడు. “నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా” అంటూ మాట్లాడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే కొద్దిరోజులకే బెయిల్ పై వినాయకన్ బయటికి వచ్చాడు. దాదాపు నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనను జైలర్ రిలీజ్ అయ్యాక వినాయకన్ హేటర్స్ మరోసారి తెరమీదకు తీసుకొచ్చారని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్న అభిమానులు. తప్పు ఎవరు చేసినా .. ఎప్పుడు చేసినా తప్పే. వినాయకన్ చేసింది కూడా తప్పే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.