Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
READ ALSO: Vivo T4 Lite 5G: 6000mAh బ్యాటరీ,50MP కెమెరాతో వివో 5G ఫోన్.. ధర తెలిస్తే ఎగబడి కొంటరు
ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాస్ యాక్షన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్, మెగా అభిమానులు కోరుకునే యాక్షన్ అన్ని ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. చిరు-నయనతార కాంబినేషన్‌లో వచ్చే సీన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.. లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్ అంటూ బాస్ చాలా ముద్దుగా నయనతారతో అంటుంటే మామూలుగా ఉండదు. అలాగే చిరంజీవి- వెంకటేష్ మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఈ రోజు రిలీజ్ అయిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను మరొక మెట్టు ఎక్కేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
READ ALSO: US vs Venezuela Military Power: అమెరికా ముందు వెనిజులా సైనిక శక్తి ఎంత? ఎవరి బలం ఎంతో తెలుసా!