TharunBhascker – EeshaRebba:ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా సాగుతున్న పెళ్లి పుకార్లలో ముందు వరుసలో ఉన్న పేర్లు డైరెక్టర్.. హీరో తరుణ్‌భాస్కర్- హీరోయిన్ ఈషారెబ్బ. జనవరి 30న ఈ ఇద్దరి జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారి రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు.
READ ALSO: Tharun Bhascker : ఈషా అంటే నాకు చాలా ఇష్టం.. ఓపెనైన తరుణ్ భాస్కర్!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈషా నాకు స్నేహితురాలు కంటే ఎక్కువ.. జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి” అని చెప్పారు. గత కొద్ది కాలంగా ఆమె తన జీవితంగా కీలక వ్యక్తిగా మారారని అన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి గానీ, దాచడానికి గానీ ఏమీ లేదని వెల్లడించారు. ప్రస్తుతం తమ ఇద్దరి గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. నేను తొందరపడి ఏదైనా చెబితే అవతలి వారిని ఇబ్బంది పెట్టవచ్చు, అందుకే సరైన టైం కోసం ఆగుతున్నా అని అన్నారు. మొత్తానికి త్వరలోనే ఈ ప్రచారానికి శుభం కార్డు వేస్తామని చెప్పారు. ఇదే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా పాల్గొని మాట్లాడుతూ.. “నా జీవితంలో ఏదైనా ముఖ్యమైనది జరిగితే.. నేనే అందరికీ చెప్తాను” అని ఆమె వెల్లడించారు.
READ ALSO: Paris Hindu Temple: ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..